పంజాబ్‌లో పోలీసులకు పీపీఈ కిట్లు


కరోనాపై పోరాడుతున్న పోలీసు సిబ్బందికి కూడా వ్యక్తిగత రక్షణ  (పీపీఈ) కిట్లు అందిస్తామని పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ ప్రకటించారు. లూథియానాలో అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌కు కరోనా పాజిటివ్‌ రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కరోనాను వ్యాప్తిని నిరోధించడానికి చేపట్టిన లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న పోలీసులు సురక్షితంగా ఉండేలా చూడటమే తమకు ప్రధానమని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 16వేల మంది వైద్యసింబ్బందికి ఇలాంటి కిట్లను అందిచామని, పోలీసులకు కూడా సరఫరా చేస్తామని వెల్లడించారు.