ఎయిర్‌లైన్స్ షాక్.. ప్రయాణికులకు నో రిఫండ్


మరోసారి లాక్‌డౌన్ పొడిగించడంతో ముంద‌స్తుగా.. మే 3వ‌ర‌కు చేసుకున్న ప్ర‌యాణాల బుకింగ్ ల‌ను విమాన‌యాన సంస్థ‌లు ర‌ద్దు చేస్తున్నాయి. అయితే, ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారికి రిఫండ్స్ ఇచ్చే అవకాశం లేదంటూ, ఎయిర్ లైన్స్ సంస్థలు  ప్ర‌యాణికుల‌కు షాకింగ్ న్యూస్ చెప్పాయి. విమానాలు రద్దు అయినా, టికెట్ల రిఫండ్ చేయరాదని నిర్ణయించామని, ప్రయాణికులు అదనపు రుసుములు చెల్లించకుండా, మరో తేదీని ఎంచుకుని ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోవచ్చని విమానయాన సంస్థ‌లు తెలిపాయి. అయితే ఇందులో కొన్ని సంస్థ‌లు కొన్ని నెల‌ల వ‌ర‌కు స‌మ‌యం ఇవ్వ‌గా, మ‌రికొన్ని సంస్థ‌లు ఏడాది వ‌ర‌కు ఎప్పుడైనా ఉప‌యోగించుకోవచ్చ‌ని తెలిపాయి.